MLA రఘునందన్ రావుపై అబిడ్స్ PSలో కేసు

MLA రఘునందన్ రావుపై అబిడ్స్ PSలో కేసు

బీజేపీ MLA రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. జూబ్లీహిల్స్ బాలికపై అఘాయిత్యం జరిగిన కేసులో ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంపై.. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఓ స్వచ్ఛంద ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు అబిడ్స్ పోలీస్ లు. IPC సెక్షన్ 228A,376 కింద కేసు నమోదు చేశారు. మైనర్ అఘాయిత్యం కేసులో రఘునందన్ రావును విచారించేందుకు న్యాయ సలహాతీసుకుంటామంటున్నారు పోలీసులు. ఇప్పటికే వీడియో లు వైరల్ చేసిన ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..తాజాగా మరో రెండు యూట్యూబ్ ఛానల్స్ పై కేసు నమోదు చేశారు. 

అయితే సోమవారమే దీనిపై రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. ‘కేసులోని బాధిత అమ్మాయి పేరు, ముఖం తాను చూపెట్టలేదన్నారు.  ఈ కేసులో ఎంఐఎం  నేతలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో కీలక ఆధారాలను తాను బయటపెట్టకముందే అన్ని టీవీల్లో ఆధారాలు ని తెలిపారు. ఇలాంటి కేసులో అధికారుల అండదండలతో అసలైన దోషులను తప్పించాలని చూడటం దుర్మార్గమైన కుట్ర అన్నారు. 

ఇక హైదరాబాద్ అమ్నీషియా పబ్ కేసుకు సంబంధించి జూన్ 4న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధారాలను బయటపెట్టారు. వాటిని డీజీపీకి పంపిన ఆయన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కారు‌లో మైనర్ పై   జరుగుతున్న దురాగతానికి సంబంధించిన ఫొటోలను చూపెట్టారు. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో కేసు విచారణ చేయించాలని.. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం లేదని పోలీసులు ఎలా క్లీన్ చిట్ ఇస్తారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాతే పోలీసులు హడావుడి చేశారని విమర్శించారు. 

మరోవైపు జూబ్లీహిల్స్ మైనర్ పై అఘాయిత్యం కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కేసులో ఐదు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎమ్మెల్యే కొడుకుపై వస్తున్న ఆరోపణలతో ఇప్పటికే రెండు సార్లు బాధితురాలు...మైనర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు జైలులో ఉన్న నిందితులను ఏడు రోజుల కష్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అత్యాచార బాధితులకు సంబంధించిన వివరాలను వెల్లడించకూడదని ఆబిడ్స్ ఎస్సై నరేష్ కుమార్ అన్నారు. కానీ ఎమ్మెల్యే రఘునందనరావు ప్రెస్ మీట్ పెట్టి ఆ డిటెయిల్స్ ను వెల్లడించినందునే ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. 228ఏ కింద ఎమ్మెల్యేపై కేసు రిజిష్టర్ అయిందని, వచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశామని తెలిపారు. ఈ కేసులో ఆయనకు త్వరలోనే నోటీసులు కూడా పంపిస్తామని ఎస్సై స్పష్టం చేశారు.