ఎన్నికల రూల్స్​ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేతలపై కేసు

ఎన్నికల రూల్స్​ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేతలపై కేసు

బషీర్​బాగ్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల రూల్స్​ఉల్లంఘించినందుకు ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలపై నారాయణగూడ పీఎస్​లో కేసు నమోదు చేశారు. ఈ నెల 7న హైదర్​గూడలో జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ పాల్గొన్నారు.  

సమావేశం నిర్వహణకు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి అనుమతి ఇచ్చారు. కానీ.. రాత్రి 10 గంటల వరకు సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు నారాయణగూడ పోలీసులకు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ సభ్యుడు డేనియల్ సుకుమార్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు నారాయణగూడ ఎస్ఐ షఫీ తెలిపారు.