వెయ్యి కోట్ల ప్రజాధనం వృథా.. సచివాలయ నిర్మాణంపై సుప్రీంలో పిటిషన్

వెయ్యి కోట్ల ప్రజాధనం వృథా.. సచివాలయ నిర్మాణంపై సుప్రీంలో పిటిషన్

కొత్త సచివాలయం నిర్మాణానికి, పాత సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో జూన్ 29 న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషనర్  తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి  సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించింది.  మొత్తం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1966 నుంచి 2012 వరకు ఈ భవనాలను నిర్మించారు. వీటికి మరో 70 ఏళ్ల జీవితకాలం ఉంది. కూల్చివేత నిర్ణయంపై పిటిషనర్ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 2016 లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా జూన్ 29 న పిటిషన్ ను డిస్మిస్ చేసింది. పాత భవనాలు కూల్చి,  కొత్త భవనాలు నిర్మించడం ద్వారా సుమారు రూ . 100 కోట్ల మేర ప్రజాధనం వృథా అవుతోంది. దీనిని నివారించేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాం. ” అని పిటిషన్ లో పేర్కొన్నారు.  హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభమయ్యాయని , తక్షణమే జోక్యం చేసుకొని హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని జీవన్ రెడ్డి అభ్యర్థించారు.