జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా యూసఫ్ గూడలో ఘర్షణలకు దిగిన బీఆర్ఎస్ నేతలపై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బైపోల్ కోసం యూసఫ్ గూడ లోని మహ్మద్ ఫంక్షన్ హాల్ ను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక కార్యాలయంగా తీసుకున్నది.
మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత, కౌశిక్‌రెడ్డి, కార్పొరేటర్లు దేదీప్య రావు, శ్యామల, వెంకటేశ్ మరికొందరు బీఆర్ఎస్ నాయకులు ఈ ఫంక్షన్ హాల్లోకి చొరబడి అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్త ఆనందరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బీఆర్ఎస్ నేతలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
