
- మాజీ సీఎస్పై కేసు
- మరికొందరు అధికారులపై కూడా..
జీఎస్టీ స్కాంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై హైదరాబాద్ CCS పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నులశాఖ కంప్లైట్ తో FIRలో ఆయన్ను ఐదో నిందితుడిగా చేర్చారు. టాక్స్ ఎగవేతదార్లకు నిందితులు సహకరించటం ద్వారా వేలకోట్ల అక్రమాలు జరిగినట్లు వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కనూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ఐఐటీ-హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు..
డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్ నిందితులుగా చేర్చారు. వీరిపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఒక్క బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగువేతతో వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చిందని, మరో 11 ప్రైవేట్ సంస్థలు దాదాపు 400 కోట్లు ఎగవేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. IGSTలో అక్రమాలను గుర్తించకుండా సాప్ట్ వేర్ లో మార్పులు చేయటంతో ప్రభుత్వానికి నష్టం వచ్చిందన్నారు అధికారులు. సోమేశ్ కుమార్ ఆదేశాలతోనే సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశామని ఇద్దరు నిందితులు చెప్పినట్టు సమాచారం.