అక్రమ న‌‌ల్లా క‌‌నెక్షన్.. 9 మందిపై క్రిమినల్ కేసులు

అక్రమ న‌‌ల్లా క‌‌నెక్షన్.. 9 మందిపై క్రిమినల్ కేసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మెట్రోవాటర్​బోర్డు సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన తొమ్మిది మందిపై బోర్డు విజిలెన్స్​ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాటర్​బోర్డు  ఓ అండ్ ఎం డివిజన్ నం.4 రెడ్ హిల్స్ లో-లెవెన్​ సెక్షన్ పరిధిలోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఇటీవల జీహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా తొమ్మిది మంది ఇంటికో అధికార కనెక్షన్ ఉండగా అధికారుల అనుమ‌‌తులు లేకుండా వారే సొంతంగా మొత్తం 15 అక్రమ న‌‌ల్లా కనెక్షన్లను  తీసుకున్నారు. 

విష‌‌యాన్ని గుర్తించిన బోర్డు విజిలెన్స్ విభాగం ఎండీ అశోక్​రెడ్డి ఆదేశాలతో అక్రమ న‌‌ల్లా క‌‌నెక్షన్‌‌ను తొల‌‌గించ‌‌డంతో పాటు క‌‌నెక్షన్ తీసుకున్న తొమ్మిది మందిపై కేసు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అక్రమ కనెక్షన్​లపై విజిలెన్స్ బృందానికి 99899 98100, 99899 87135 నంబర్లకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.