పబ్ గొడవలో నటి కల్పికపై కేసు నమోదు..

పబ్ గొడవలో నటి కల్పికపై కేసు నమోదు..

సినీ నటి కల్పికపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. మే 29న హైదరాబాద్ లోని ప్రిజం పబ్ లో జరిగిన గొడవ విషయంలో కేసు నమోదు చేశారు పోలీసులు. పబ్ లో బిల్ పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు కల్పిక. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేస్తూ బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించారు కల్పిక. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. బీఎన్ఎస్ 324(4),352,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.మొదట.. బర్త్ డే కేక్ విషయంలో కల్పికకు, సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారగా.. నటి కల్పిక పబ్ సిబ్బందిపై పచ్చి బూతులతో రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమెపై ప్రతిదాడికి దిగారు సిబ్బంది.

కాగా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పికా గణేష్​గతంలో కూడా పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. నటుడు అభినవ్​ గోమటంపై ఆమె కాంట్రవర్శియల్​ కామెంట్స్​చేసింది. అభినవ్ పురుషాహంకారి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

కల్పిక ఆరోపణలకు అభినవ్ కూడా కౌంటర్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్‎గా నిలిచింది. అంతేకాకుండా కల్పిక, అభినవ్ ప్రేమలో ఉన్నట్లు కూడా సినీ సర్కిల్స్‎లో వార్తలు గుప్పుమన్నాయి. తామిద్దరం స్నేహితులమని ఇద్దరి మధ్య ప్రేమా గీమా లాంటివేమీ లేవని అభినవ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్‎కు చెక్ పడింది.