
టాలీవుడ్ ప్రముఖ హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులతో పాటు ఓ రాజకీయ నేత సంస్థ ఎండీపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ప్రాజెక్టును టీహెచ్‌డీసీ ద్వారా ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్ట్ ను దక్కించుకొంది. ఈ ప్రాజెక్టును బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్, స్వాతి కన్‌స్ట్రక్షన్స్ అనే రెండు సంస్థలకు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు.
అయితే, రెండు గ్రూపుల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది. ఈక్రమంలో రిత్విక్ ప్రాజెక్ట్స్‌తో చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు. దింతో ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మొత్తం డబ్బు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ రవికృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రొగ్రెసివ్ కంపెనీలో ఉన్న డైరక్టర్లతో పాటు 5 మందిపై సెక్షన్ 406, 420, 506 రెడ్ విత్ 34 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బంజారహిల్స్ పోలీసులు.