కేసీఆర్ అన్నకొడుకు కన్నారావుపై ల్యాండ్ కబ్జా కేసు నమోదు..

కేసీఆర్ అన్నకొడుకు కన్నారావుపై ల్యాండ్ కబ్జా కేసు నమోదు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నా రావు) పై కేసు నమోదైంది. OSR ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నా రావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నించినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు.

 ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్ళు పెట్టినట్టు కంప్లైంట్ లో పేర్కొన్నారు. కన్నారవుతో పాటు అతని అనుచరులు బీఆర్ఎస్ నాయకులు 38 మందిపై 307.447.427.436.148.149 ఐపిసి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. 38 మందిలో ముగ్గురని పోలీసులు రిమాండ్ లోకి తీసుకోగా మరో 35 మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు. కేసీఆర్ అన్నకొడుకు కన్నారవు బెంగుళూరులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.