Cash Deposit Limit: బ్యాంకులకు వెళ్లకుండా..ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయొచ్చు..లిమిట్ ఎంతెంతంటే..

Cash Deposit Limit: బ్యాంకులకు వెళ్లకుండా..ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయొచ్చు..లిమిట్ ఎంతెంతంటే..

సాధారణంగా బ్యాంకు అకౌంట్లలో నగదు డిపాజిట్ చేయాలంటే సంబంధిత బ్యాంకు బ్రాంచ్ లకు వెళ్తుంటాం..ఖాతాల్లో డబ్బును జమ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డిపాజిట్ ఫాం ఫిల్ చేయాలి.. లైన్లో గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు ఖాతాల్లో నగదు జమకు ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాష్ డిపాజిట్ కమ్ విత్ డ్రా మెషీన్లు అందుబాటులో వచ్చాయి. ఈ క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా  బ్యాంకు కు వెళ్లకుండానే ఖాతాల్లో డబ్బులు జమ చేయొచ్చు. అయితే బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొన్ని పరిమితులను విధించాయి. ఏయే బ్యాంకుల్లో ఎంతెంత డబ్బును డిపాజిట్ చేసేందుకు పరిమితి ఉందో తెలుసుకుందాం.. 

ALSO READ | మరో 600 బ్రాంచ్​లను తెరుస్తం

వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసేందుకు ఎంతెంత లిమిట్ ఉందో చూద్దాం. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI): ఎస్ బీఐ బ్యాంకు క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా రూ. 49వేల 999 వరకు కార్డులెస్ డిపాజిట్లు చేసుకోవచ్చు. అదే బ్యాంకు ఖాతాకు పాన్ కార్డు అనుసంధానం చేసి ఉండి, డెబిట్ కార్డు ద్వారా రూ. 2లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. 

బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ బ్యాంకులో పాన్ కార్డు అనుసంధానం చేసి ఉన్న ఖాతాలకు రోజుకు 2లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు అనుసంధానం లేకుంటే రూ. 49వేల 999 వరకు , కార్డులెస్ డిపాజిట్లు రూ.20వేల వరకు చేయొచ్చు. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు: క్యాష్ యాక్సెప్టర్ కమ్ ఏటీఎమ్, బల్క్ నోట్ యాక్సెప్టర్ ద్వారా రోజు లక్ష రూపాయలు లేదా 200 వందల నోట్లను డిపాజిట్ చేయొచ్చు. పాన్ కార్డు బ్యాంకు అకౌంట్ కు లింకప్ చేసి ఉంటే లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేయొచ్చు. పాన్ కార్డు అనుసంధానం లేకపోతే రూ. 49వేల 999 లు జమ చేయొచ్చు. 

HDFC బ్యాంకు: HDFC క్యాష్ డిపాజిట్ మెషీన్లు ద్వారా సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో కార్డులెస్ డిపాజిట్లు రూ.25వేలు, ప్రతి రోజు 2లక్షల వరకు నగదు జమ చేయొచ్చు. కరెంట్ అకౌంట్ అయితే 1లక్ష రూపాయలు, రోజుకు 6 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. డెబిట్ కార్డు ద్వారా అయితే క్యాష్ డిపాజిట్ మెషీన్లు ద్వారా రూ.1లక్ష వరకు జమ చేయొచ్చు. 

యూనియన్ బ్యాంకు: యూనియన్ బ్యాంకు లో క్యాష్ డిపాజిట్ మెషీన్ల ద్వారా 200 వరకు నోట్లను డిపాజిట్, రూ. 49వేల 999 వరకు నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయొచ్చు. పాన్ కార్డు లింక్ ఉంటే రూ.1లక్ష వరకు నగదు జమ చేయొచ్చు.  

మరిన్ని వార్తలు