25 ఏండ్లలోపు పెండ్లి చేస్కుంటే క్యాష్ ప్రైజ్

25 ఏండ్లలోపు పెండ్లి చేస్కుంటే క్యాష్ ప్రైజ్

బీజింగ్ : జననాల రేటు పెంచేందుకు చైనా సర్కారు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. పెండ్లీడుకొచ్చిన యువతులకు ఆఫర్లు ప్రకటిస్తోంది. 25 ఏండ్లలోపే పెండ్లి చేసుకుంటే 1000 యువాన్ల (రూ.11,340) క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పింది. తూర్పు చైనాలోని చాంగ్​షాన్ కౌంటీ అధికారులు అధికారికంగా ఈ ఆఫర్ ప్రకటించారు. జననాల రేటు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

సరైన వయసులో పెండ్లిలను, ఆపై పిల్లలను కనడాన్ని ప్రోత్సహించేందుకే ప్రైజ్ మనీ పెట్టినట్లు వివరించారు. సరైన వయసులో చేసుకునే మొదటి పెండ్లికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు.  కాగా, కొన్నేండ్లుగా చైనాలో జననాల రేటు పడిపోతోంది. జనాభా పెరుగుదల తగ్గిపోతోంది. వయసులో ఉన్నోళ్లు పెండ్లికి దూరంగా ఉండటమే ఇందుకు కారణమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో రకరకాల ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది.