- అక్టోబర్ 04న శంషాబాద్‌లో సభ
- పోస్టర్‌ను ఆవిష్కరించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: జనగణనలో కులగణనను చేర్చాలనే డిమాండ్‌తో పీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 4న శంషాబాద్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభ పోస్టర్‌ను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శుక్రవారం నార్సింగిలోని తన నివాసంలో ఆవిష్కరించారు. పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు.
అనంతరం సభపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, వీర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం చేపట్టబోయే జనగణనలో భాగంగా బీసీ కుల గణన చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 4న సుమారు 25 వేల మందితో శంషాబాద్ కొల్లూరు దగ్గర ఓబీసీ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభను విజయవంతం చేయాలని పార్టీ కేడర్‌కు విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
