గోదావరిఖనిలో క్యాత్‌‌‌‌లాబ్..పీపీపీ మోడల్‌‌‌‌లో 75 రోజుల్లో ప్రారంభిస్తం: డిప్యూటీ సీఎం భట్టి

గోదావరిఖనిలో క్యాత్‌‌‌‌లాబ్..పీపీపీ మోడల్‌‌‌‌లో 75 రోజుల్లో ప్రారంభిస్తం: డిప్యూటీ సీఎం భట్టి
  •     జిల్లాలను సరిగా విభజించలేదు.. పునర్ విభజన చేపడతాం: పొంగులేటి 
  •     అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు 

హైదరాబాద్, వెలుగు:  సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి ఆసుపత్రుల్లో డాక్టర్, పారామెడికల్ సిబ్బంది పోస్టులను వచ్చే మార్చి నాటికి భర్తీ చేస్తామన్నారు. మంగళవారం అసెంబ్లీలో సింగరేణిపై ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. 

ప్రస్తుతం11 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు పని చేస్తున్నారని, 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. 176 పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. గోదావరిఖనిలో పీపీపీ మోడల్ లో క్యాత్ లాబ్ ను 75 రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. 

సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సీపీఆర్ఎంఎస్ పథకం అందుబాటులో ఉందన్నారు. టెర్మినల్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నామన్నారు. సింగరేణి  రిటైర్డ్ ఉద్యోగులకు ఇండ్ల స్థలాల అంశంపై బోర్డ్ మీటింగ్ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో వేలంలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొన్ని గనులను కోల్పోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిని వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించి కొన్ని గనులను దక్కించుకునేలా చేశామన్నారు. 

అసెంబ్లీ సమావేశాల తర్వాత సింగరేణి మనుగడ, కార్మికుల సంక్షేమంపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ర్టంలో మొత్తం 34,030 సెలూన్లు, 70,732 లాండ్రీ దుకాణాలు, దోబీఘాట్స్ 59 ఉండగా 1,04,821 లబ్ధిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని భట్టి వెల్లడించారు. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.  

జిల్లాల విభజన సరిగా చేయలేదు, సరిదిద్దుతం: పొంగులేటి

రాష్ట్రంలో గ‌‌‌‌త సర్కారు హ‌‌‌‌యాంలో అశాస్త్రీయంగా విభజన జ‌‌‌‌రిగిన మండ‌‌‌‌లాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పున‌‌‌‌ర్వ్యవ‌‌‌‌స్థీక‌‌‌‌రిస్తామ‌‌‌‌ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వేముల వీరేశం, పాల్వాయి హరీశ్ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. “గ‌‌‌‌త ప్రభుత్వ హ‌‌‌‌యాంలో మండ‌‌‌‌లాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పున‌‌‌‌ర్వ్యవ‌‌‌‌స్థీక‌‌‌‌ర‌‌‌‌ణ వర‌‌‌‌కు ఇష్టారీతిలో మొక్కుబ‌‌‌‌డిగా జ‌‌‌‌రిగాయి. 

దీనివ‌‌‌‌ల్ల ఒకే నియోజ‌‌‌‌క‌‌‌‌వ‌‌‌‌ర్గంలోని నాలుగు మండ‌‌‌‌లాలు నాలుగు జిల్లాల్లో ఉండే ప‌‌‌‌రిస్థితి ఏర్పడింది. అదేవిధంగా త‌‌‌‌మ‌‌‌‌ను పొగిడిన‌‌‌‌వారి కోసం ఒక విధంగా, పొగ‌‌‌‌డ‌‌‌‌ని వారికోసం మ‌‌‌‌రో విధంగా, త‌‌‌‌మ అదృష్టసంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభ‌‌‌‌జ‌‌‌‌న చేశారు. 

ఈ నేప‌‌‌‌థ్యంలో రాష్ట్రంలో కొత్త మండ‌‌‌‌లాలు, డివిజ‌‌‌‌న్ల ఆవశ్యక‌‌‌‌త‌‌‌‌ను గుర్తించాం. క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి జిల్లాల పున‌‌‌‌ర్వ్యవ‌‌‌‌స్థీక‌‌‌‌ర‌‌‌‌ణ చేప‌‌‌‌డ‌‌‌‌తాం” అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ర్ట ఏర్పాటు తరువాత 1,94,150 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు (ఉమ్మడి రాష్ర్టంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వాళ్లు)  రూ. 388.31 కోట్ల బకాయిలు  చెల్లించామని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.