బీఆర్ఎస్ హయాంలో ఆవుల స్కాం.. రూ.3 కోట్లు గోల్ మాల్

బీఆర్ఎస్ హయాంలో ఆవుల స్కాం.. రూ.3 కోట్లు గోల్ మాల్

హైదరాబాద్ : పశుసంవర్థక శాఖలో మరో స్కాం  వెలుగులోకి వచ్చింది.  గొర్రెల తరహాలో పశువుల కొనుగోలులో గోల్ మాల్ చేశారు. 3 కోట్ల రూపాయలు దారిమళ్లించినట్లు  గుర్తించారు ఏసీబీ అధికారులు.  బీఆర్ఎస్ హయాంలో 8 కోట్ల రూపాయలు విడుదల చేస్తే.. 3 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. బినామీల ఖాతాలోకి డబ్బులు మళ్ళించినట్లు గుర్తించారు. 

గొర్రెల స్కాంలో ఫిబ్రవరి 22న  నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను  అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే...ఇందులో భాగంగా ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పశుసంవర్ధన శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచినట్టు సమాచారం అందిందని ఏసీబీ అధికారులు తెలిపారు. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను నిందితులు మళ్లించారని పేర్కొన్నారు. 

Also Read :నిమిషం ఆలస్యం.. ఎగ్జామ్కు అనుమతించని అధికారులు