
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యం అయినా ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించబోరు అధికారులు.
నిమిషం నిబంధన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కుత్బుల్లాపూర్ గాంధీ నగర్ లోని కేమ్ బ్రిడ్జ్ కళాశాల లో ఇద్దరు విద్యార్థులు నాలుగు నిమిషాలు ఆలస్యంగా రావడంతో, పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించ లేదు కళాశాల యాజమాన్యం
సిద్దిపేట జిల్లా సిద్దిపేట ప్రభుత్వ బాలుర కళాశాలకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించకపోవడంతో వెనుదిరి వెళ్లారు విద్యార్థులు. బైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఎగ్జామ్ కు అధికారులు అనుమతించకపోవడంతో వెళ్లిపోయారు విద్యార్థులు.