
హైదరాబాద్, వెలుగు: వైరా బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కొడుకు జీవన్‌లాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ ఐటీ ఎక్సెంప్షర్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జీవన్‌లాల్.. ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందుకు ఓ కంపెనీ నుంచి రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి.
దాంతో కేసు నమోదు చేసిన అధికారులు.. జీవన్‌లాల్ సహా శ్రీకాకుళానికి చెందిన శ్రీరామ్ పలిశెట్టి, విశాఖపట్నానికి చెందిన నట్ట వీర నాగ శ్రీరామ్‌గోపాల్, ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజికి, విరల్ కాంతిలాల్ మెహతా, సాజిద మజ్హర్ హుస్సేన్ షాలను అరెస్టు చేశారు.
ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్, ఖమ్మం, ముంబై, విశాఖపట్నం, ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నిందితుల ఇండ్లు, కార్యాలయాల్లో సెర్చ్ చేసి..ట్యాక్స్ అప్పీళ్లకు చెందిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.