భోపాల్ లో మాజీ జడ్జి గిరిబాల సింగ్ అరెస్ట్...త్విషాశర్మ మృతి కేసులో సీబీఐ చర్య

భోపాల్ లో మాజీ జడ్జి గిరిబాల సింగ్ అరెస్ట్...త్విషాశర్మ మృతి కేసులో సీబీఐ చర్య

భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్విషాశర్మ అనుమానాస్పద మృతి కేసులో ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్‌‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్‌‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల త్విషాశర్మ తన అత్తవారింట్లో ఉరివేసుకుని చనిపోయారు. అయితే, పెళ్లి సమయం నుంచి అత్త గిరిబాల సింగ్, భర్త సమర్థ్ సింగ్ వరకట్నం కోసం త్విషాను వేధింపులకు గురిచేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. 

అప్పగింతల సమయంలో కూడా గిరిబాల ఒత్తిడి తెచ్చి రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సీబీఐ ఎఫ్‌‌ఐఆర్‌‌లో పేర్కొంది. బాధితురాలి శరీరంపై మరణానికి ముందు ఏర్పడిన గాయాలు ఉన్నాయని, సైబర్ క్రైమ్, ఫోరెన్సిక్స్‌‌లో శిక్షణ పొందిన మాజీ జడ్జి గిరిబాల సింగ్ తన నైపుణ్యంతో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.