లంచం తీసుకున్నారని పోస్టాఫీస్ అధికారులపై సీబీఐ కేసు

లంచం తీసుకున్నారని పోస్టాఫీస్ అధికారులపై సీబీఐ కేసు

పోస్ట్ మాస్టర్ హెడ్‌క్వార్టర్స్, రీజియన్  లో విధులు నిర్వహించే ముగ్గురు అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్,  2 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల రిక్రుట్మెంట్ కు సంబంధించిన విషయంలో లంచం తీసుకున్నట్టుగాను ఆరోపణలు ఎదుర్కున్నారు సదరు అధికారులు. లంచం ఫిర్యాదుతో సీబీఐ అధికారులు కేసు ఫైల్ చేశారు. 

10 మంది కంటింజెంట్ లేబర్‌లను MTSగా నియమించినందుకు ఇద్దరు కంటింజెంట్ లేబర్స్ నుంచి రూ. 25 లక్షలు లంచం తీసుకున్నట్టుగాను అధికారులపై అభియోగాలు ఉన్నాయి.16 జూలై 2022న రూ. 2,00,000, మరొక వ్యక్తి MTS కోసం 26 జూలై 2022న రూ. 1,00,000 ఇచ్చినట్టు కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది.  హైదరాబాద్‌లోని మూడు చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించగా, నేరారోపణ పత్రాలు రికవరీ అయ్యాయని దీనిపై విచారణ జరుగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు.