ఢిల్లీ: పిల్లల అక్రమ రవాణాపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సిబిఐ బృందం శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించింది. ఢిల్లీలో చైల్డ్ ట్రాఫిక్కింగ్ తో సంబంధమున్న పలు స్థావరాలపై అధికారులు దాడులు చేశారు. ఈ క్రమంలో కేశవ్ పురమ్ లోని ఓ ఇంట్లో ఉన్న ఇద్దరు శిశువులను కాపాడారు.
పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ మహిళతోపాటు కొంతమందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు శిశువులను అమ్మిన మహిళ, కొన్న వ్యక్తి విచారిస్తున్నారు అధికారులు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.