- పండుగ సెలవులు, జాతర
- వనదేవతల గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తులు
- పార్కింగ్ కోసం పొలాల్లోకి వాహనాలు
- జంపన్నవాగు వద్ద వేడి నీళ్లు బకెట్ రూ. 50
హైదరాబాద్: వరుస సెలవుల కారణంగా వనదేవతల దర్శనానికి జనం భారీగా తరలివస్తు న్నారు. దీంతోగట్టమ్మ ఆలయం నుంచే ట్రాఫిక్ జాం మొదలయ్యింది. పలు వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇంకా కొందరు తమ వా హనాలను పొలాల్లోకి మళ్లించి ఆలయం వరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. జాతర సమీపిస్తుండటంతో భక్తులు రాక మొదలైంది. మేడారం సమీపానికి వచ్చిన తర్వాత కూడా ట్రాపిక్ జాం ఏర్పడింది.
వాహనాలు డైవర్ట్ చేసి ఎప్పటికప్పుడు అధికారులు క్లియర్ చేస్తు న్నారు. తాడ్వాయి వైపు, పస్రా వైపు మార్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. మేడారానికి నాలుగు లైన్ల రోడ్డు నిర్మించినప్పటికీ భక్తులు బాగా తరలివ స్తుండటంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. అంచ నాలకు మించి భక్తులు వస్తుండటంతో ఈ పరి స్థితి నెలకొంది. ఇవాళ ఒక్క రోజే ఐదు లక్షల మంది సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రైవేటు వాహనాలు భారీగా రావడంతోనే ఈ పస్రావద్ద నుంచి తాడ్వాయి కాల్వపల్లి వద్ద, జంపన్న వాగు వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా జనవరి 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం తల్లులను దర్శించు కోనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు ఈ సారి 3 కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
