రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పరిపాలనలో ముందుకు సాగుతున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నచ్చితే వచ్చి ఆశీర్వదించు.. నచ్చకపోతే ఫామ్ హౌస్ లో పండుకో.. అంతే తప్ప మారు వేషంలో మారీచులను పంపితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం (జనవరి 17) మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఎంవీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం.. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు.
ALSO READ : క్రికెట్కు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో కాకా వెంకటస్వామి కృషి..
సీఎం రేవంత్ స్పీచ్ హైలైట్స్:
- పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారుపేరు
- పాలమూరు కష్టాలకు కారణం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవటం
- కేసీఆర్ హయాంలో పాలమూరును పట్టించుకోలేదు
- గత పదేళ్లలో పాలమూరులో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు
- నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ను కేసీఆర్ పట్టించుకోలేదు
- ప్రాజెక్టుల పేరుమీద కాంట్రాక్టర్లకు రూ.23 వేల కోట్లు చెల్లించారు
- సంగంబండ దగ్గర బండ పగలగొట్టేందుకు కేసీఆర్ రూపాయి ఇవ్వలే
- పాలమూరు రంగారెడ్డిని 2013లో అప్పటి కాంగ్రెస్ నేతలే సాధించారు
- పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసే బాధ్యత నాది
- పాలమూరు అభివృద్ధి కోసం కేంద్రాన్ని కలుస్తా
- పాలమూరులో IIM కోసం కేంద్రాన్ని కలుస్తాం
- పాలమూరు రండారెడ్డిపై అసంబ్లీలో చర్చ పెడితే సభకు రాకుండా పారిపోయారు
- జైపాల్ రెడ్డి, జానారెడ్డి మాదిరిగా శాంతంగా ఉండే ప్రసక్తే లేదు
- మోదీని పదే పదే కలుస్తాం.. ఇచ్చే వారిని కలవటంలో తప్పేంది
- నిధులు కావాలంటే, అభివృద్ధి కావాలంటే కలవడంలో తప్పేంది
- దేశ ప్రధానిగా మోదీని గౌవిస్తాం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం
- కానీ ఎన్నికల్లో కాంప్రమైజ్ కాము..
- రాజకీయ ప్రత్యర్థులే కానీ.. తనకు శత్రువులు ఎవరూ లేరు
- శత్రువు అనుకుంటే వారిని 2023లో బండకేసి కొట్టి ఫామ్ హౌస్ లో పండుకోబెట్టిన
- నా శత్రువులు నిరక్షరాస్యత, పేదరికం, మహిళలను అన్యాయం చేసేవాళ్లు, సదువుకోకుండా ఊర్లలో తిరిగే వాళ్లు..
- పేదరికం అనే శత్రువును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి
- భూములు ఉన్నవాళ్లకు ఉచిత కరెంటు ఇస్తున్నారు.. మరి లేని వాళ్ల సంగతేంటి అంటే..
- 52 లక్షల కుటుంబాల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం
- ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారు.. రూపాయి పుట్టకుండా చేశారు
- రెండేండ్లలో రూ.27 వేల కోట్లతో వడ్డీలేని రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం
- మహిళలను బస్సులకు ఓనర్లు చేశాం
- 65 లక్షల ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినం.. మరో 35 లక్షల మందికి ఇస్తాం..
