టాటా ముంబై మారథాన్ 2026లో పాల్గొనాలనుకుంటున్నారా ? మారథాన్ పరుగు శారీరానికి మంచిదే అయిన... సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబైలోని గ్లెనీగల్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రకారం రన్నర్ల కోసం కొన్ని సూచనలు చేశారు....
1.పరిగెత్తేటప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా అసౌకర్యం అనిపించిన లేదా తల తిరగడం లేదా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించిన, విపరీతంగా ఆయాసం వచ్చిన, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, శరీరం అలసిపోయి సహకరించకపోవడం వంటి శరీర మార్పులు కనిపిస్తే వెంటనే పరుగు ఆపి సహాయం తీసుకోండి.
2. మీరు మొదటిసారి పరిగెడుతున్నా లేదా మధ్య వయస్సు వారైనా మారథాన్‌కు ముందు తప్పనిసరి BP చెకప్, ECG & 2D ఎకో, TMT టెస్ట్, షుగర్, బీపీ లేదా మీ కుటుంబంలో గుండె జబ్బుల ఉన్నవారు ఉంటె డాక్టర్‌ను కలిసి అన్ని పరీక్షలు చేయించుకోవడం మంచిది.
3. ఫ్రెండ్స్ పరిగెడుతున్నారని లేదా సరదా కోసం ఒక్కరోజులో నిర్ణయం తీసుకుని శిక్షణ లేకుండా మారథాన్‌లో పాల్గొనకండి. ఎందుకంటే మారథాన్ కోసం కనీసం 6 నెలల నుండి ఏడాది పాటు శిక్షణ అవసరం. సరైన ప్రాక్టీస్ లేకపోతే గుండె, కండరాలపై భారం పడి ప్రమాదం కలిగే అవకాశం ఉంది.
4. పరుగుకు ముందు, పరుగు సమయంలో తగినంత నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి. మారథాన్ రేసుకి ముందు రోజు రాత్రి సరైన నిద్ర అంటే కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. గుండె వేగాన్ని కనిపెట్టే స్మార్ట్ వాచ్ లేదా మానిటర్ ధరించడం వల్ల మీరు ఎక్కువగా శ్రమించకుండా జాగ్రత్త పడవచ్చు.
5. పరుగు ఆపిన వెంటనే కూర్చోకుండా, కాసేపు మెల్లగా నడుస్తూ శరీరాన్ని రిలాక్స్ చేయాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. రాబోయే కొన్ని రోజుల పాటు కఠినమైన వ్యాయామాలు చేయకుండా శరీరానికి ఫుల్ రెస్ట్ ఇవ్వాలి.
►ALSO READ | టార్గెట్ మమతా బెనర్జీ.. బెంగాల్‌లో నిజమైన మార్పు రావాలన్న ప్రధాని మోడీ..
6. మొదటిసారి పరుగెత్తేవారు లేదా ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారు హార్ట్ బీట్ రేటు ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడానికి, పరుగెత్తేవారు ఎక్కువ శ్రమించకుండా అలెర్ట్ చేయడానికి హార్ట్ మానిటర్ ఉపయోగించుకోవచ్చు, దీని వాళ్ళ ప్రమాదకరమైన సమస్యలు రాకముందే మారథాన్ స్పీడ్ తగ్గించుకోవచ్చు లేదా ఆపవచ్చు.
7. మారథాన్ తర్వాత రిలాక్స్ అవ్వండి, బాగా నీరు త్రాగండి, సరైన ఆహారం తీసుకోండి. తగినంత విశ్రాంతితో పాటు త్వరగా కోలుకోవడానికి రాబోయే కొన్ని రోజులు మీ శరీరం చెప్పేది వినండి. మారథాన్ తర్వాత వెంటనే ఎటువంటి కఠినమైన పనులు చేయడానికి ప్రయత్నించవద్దు.
8. మారథాన్ పరుగెత్తడం వల్ల గుండెపై కొంత ఒత్తిడి పెరుగుతుంది, ముఖ్యంగా శరీరం రెడీగా లేకుంటే. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం, పోషకమైన భోజనం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, గుండె ఆరోగ్యాన్ని చూసుకునేందుకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం లాంటి గుండెకు ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించండి.
