కాకా మెమోరియల్ T20 లీగ్ ఫైనల్.. ఖమ్మంపై అలవోకగా గెలిచిన నిజామాబాద్.. ప్రైజ్ మనీ ఎంతంటే..

కాకా మెమోరియల్ T20 లీగ్ ఫైనల్.. ఖమ్మంపై అలవోకగా గెలిచిన నిజామాబాద్.. ప్రైజ్ మనీ ఎంతంటే..

విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. భారీ అంచనాల నడుమ ఖమ్మం, నిజామాబాద్ జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం టీమ్.. 19.5 ఓవర్లకు 114 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. 

నిర్ణీత 20 ఓవర్లలో 115 రన్స్ టార్గెట్ తో నిజామాబాద్ బరిలోకి దిగింది.  ఖమ్మం విధించిన టార్గెట్ ను 8 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేజ్ చేసి అజేయ విజయం సాధించింది నిజామాబాద్ జట్టు. 12 ఓవర్లలో 8 ఓవర్లు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో మ్యాచ్ ను ముగించింది. అద్భుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పి గెలుపుకు కారణమైన హర్షవర్ధన్ సింగ్ 69 (37) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. 

►ALSO READ | నితీష్ రెడ్డి అసలు ఆల్ రౌండరే కాదు: తెలుగు క్రికెటర్‎పై మహ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్

శనివారం (జనవరి 17) సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స లో జరుగిన మ్యాచ్ కు మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఉత్తం కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  మహ్మద్ అజారుద్దీన్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, BCCI మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్,  HCA సభ్యులు హాజరయ్యారు. మ్యాచ్ ను ఉత్సాహంగా ఆస్వాదించారు. 

ఫైనల్ లో విజయం సాధించిన నిజామాబాద్ జట్టుకు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందించనున్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా గెలిచిన జట్టుతో పాటు టోర్నీలో పాల్గొన్న టీమ్ సభ్యులను అభినందించారు మంత్రులు వివేక్, పొన్నం, ఎంపీ వంశీకృష్ణ.