ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారణకు అనుమతివ్వాలని సీబీఐ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను విచారణకు అనుమతివ్వాలని సీబీఐ పిటిషన్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. కవిత  విచారణకు అను మతివ్వాలని  రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు. జైల్లోనే ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేయాలని సీబీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మార్చి 15,2024న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో 100 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలతో గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అదే రోజు సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు.