నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణ చేయాలి : వివేక్ వెంకటస్వామి

నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణ చేయాలి : వివేక్ వెంకటస్వామి

మహబూబ్ నగర్ : కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని విమర్శించారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీ, సెక్రటేరియట్ బిల్డింగ్ లు కూల్చాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చాలనే కాళేశ్వరం డిజైన్ మార్చారని చెప్పారు వివేక్. మంగళవారం మహబూబ్ నగర్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాల్లో నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణ చేయాలని వివేక్ డిమాండ్ చేశారు.