
బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
హైదరాబాద్: నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న అసాఘింక కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. గతంలో నారాయణ కళాశాలలో తెలంగాణ ఇంఛార్జి జయసింహ రెడ్డి లైంగిక వేధింపులు తట్టుకోలేక శ్రీలత అనే ప్రిన్సిపల్ ఆత్మహత్య యత్నం చేయగా….ఇప్పటివరకు పోలీసులు చర్య తీసుకోకపోవడం దారుణమని బీసీ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆరోపించారు. మళ్ళీ అదే జయసింహ రెడ్డి ఓ అధ్యపకురాలు తో ఫోన్ లో మాట్లాడుతున్న సంభాషణను ఆయన బహిర్గతం చేసారు.
ఇంత జరుగుతున్నా జయసింహ రెడ్డి పై చర్యలు తీసుకోకుండా… ప్రమోషన్లు ఇచ్చి కొనసాగించడంపై నరేందర్ గౌడ్ మండిపడ్డారు. ఆ కళాశాలలో పనిచేస్తున్న మహిళ అధ్యాపకులకు , విద్యార్థినులకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేసారు. నారాయణ కళాశాలల్లో జరుగుతున్న వ్యవహారాలపై రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లను , ముఖ్యమంత్రులను కలిసి త్వరలో పిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.