SRH vs DC: తీసి పక్కన పడేయ్.. రనౌట్‌తో కావ్య మారన్ ఊర మాస్ సెలెబ్రేషన్

SRH vs DC: తీసి పక్కన పడేయ్.. రనౌట్‌తో కావ్య మారన్ ఊర మాస్ సెలెబ్రేషన్

ఐపీఎల్‌ 2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపోటములు పక్కనపెడితే కావ్య మారన్ ఇచ్చే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. గెలిస్తే ఓ రేంజ్ లో సెలెబ్రేషన్ చేసుకునే ఆమె.. ఓడిపోతే అంతే నిరాశకు గురవుతుంది. ఈ సీజన్ లో సన్ రైజర్స్ దారుణంగా ఆడడంతో కావ్యమారన్ కు నిరాశే మిగిలింది.  ప్రతి మూమెంట్ కు వేరు వేరు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చే ఆమె.. సోమవారం (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్ తో  మ్యాచ్ లో ఊర మాస్ సెలెబ్రేషన్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. 

ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. ఈ సీజన్ లో తొలిసారి అద్భుతంగా బౌలింగ్ చేసిన హైదరాబాద్ ఢిల్లీకి బిగ్ షాక్ ఇచ్చింది. 29 పరుగులకే 5 వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు బిగించింది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ను స్టబ్స్, విప్రాజ్ నిగమ్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. 5 ఓవర్ల పాటు వికెట్ పడకుండా 32 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. 12 ఓవర్ తొలి బంతికి విప్రాజ్ నిగమ్ (18) రనౌట్ కావడంతో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. అన్సారీ వేసిన బాల్ ను మిడ్ వికెట్ దిశగా ఆడిన స్టబ్స్ మొదటి పరుగు పూర్తి చేశాడు. 

రెండో పరుగు అవకాశం ఉండడంతో వేగంగా పరిగెత్తాడు. అయితే అదే సమయంలో విప్రాజ్ పరుగు తీయాలా వద్ద అనే సందేహంలో అక్కడే ఉండిపోయాడు. దీంతో సన్ రైజర్స్ ఈజీ రనౌట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ తీసింది. వికెట్ పడగానే కావ్య మారన్ చేసుకున్న సెలెబ్రేషన్ నెటిజన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. పళ్ళు గట్టిగా కొరుకుతూ తీసి పక్కన పడేయ్ అన్నట్టుగా ఇచ్చిన మాస్ ఎక్స్ ప్రెషన్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.  

►ALSO READ | SRH బౌలింగ్ అదుర్స్.. కానీ టైం బ్యాడ్.. ఆశలపై ఉత్త నీళ్లు కాదు వర్షం నీళ్లు..!

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ సీజన్ లో తొలిసారి సన్ రైజర్స్ బౌలర్లు విజృంభించారు. సొంతగడ్డపై ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ ను స్వల్ప స్కోర్ కే పరిమితం చేసింది. కెప్టెన్ కమ్మిన్స్ పవర్ ప్లే లో వికెట్లతో చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు.. ఉనాద్కట్, హర్షల్ పటేల్ ఇషాన్ మలింగా తలో వికెట్ తీసుకున్నారు.