
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అడ్డు తగిలింది. ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా వదిలేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశలపై ఉత్త నీళ్లు కాదు వర్షం నీళ్లు చల్లినట్టయింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ప్లే ఆఫ్ రేసు నుంచి SRH జట్టు పూర్తిగా తప్పుకున్నట్టే. ఇక ఒక్క శాతం, అర శాతం ఆశలకు అవకాశమే ఉండదు.
SRH బౌలర్ల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH కెప్టెన్ కమ్మిన్స్ బౌలింగ్లో అదరగొట్టాడు. 4 ఓవర్లకు 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి ఢిల్లీ టాపార్డర్ను కుప్పకూల్చాడు. ఆ తర్వాత.. జయదేవ్ ఉనద్కట్ కూడా 4 ఓవర్లకు 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హర్షల్ పటేల్, ఇషాన్ మలింగకు చెరో వికెట్ దక్కింది.
134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వర్షం ఆటంకం కలిగించింది. ఢిల్లీ ఇన్నింగ్స్ అయిపోయిన కాసేపటికే వర్షం మొదలైంది. చిరు జల్లుగా మొదలై భారీ వర్షంగా మారడంతో SRH అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ జరిగే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు.
►ALSO READ | SRH vs DC: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ఢిల్లీ
ప్రస్తుతం ఢిల్లీ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఐదో ప్లేస్‌లో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే SRH జరిగిన ఈ మ్యాచ్ గెలవడం కూడా ఢిల్లీకి చాలా అవసరం. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా ఢిల్లీకే కొంత మేలు జరిగే అవకాశం ఉంది.