SRH vs DC: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ఢిల్లీ

SRH vs DC: విజృంభించిన సన్ రైజర్స్ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ఢిల్లీ

ఐపీఎల్ 2025లో తొలిసారి సన్ రైజర్స్ బౌలర్లు విజృంభించారు. సొంతగడ్డపై ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్ ను స్వల్ప స్కోర్ కే పరిమితం చేసింది. కెప్టెన్ కమ్మిన్స్ పవర్ ప్లే లో వికెట్లతో చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్ రైజర్స్ బౌలర్లలో కమ్మిన్స్ మూడు.. ఉనాద్కట్, హర్షల్ పటేల్ ఇషాన్ మలింగా తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు సన్ రైజర్స్ బౌలర్లు షాకుల మీద షాకులు ఇచ్చారు. తొలి ఓవర్ తొలి బంతికే కమ్మిన్స్ కరుణ్ నాయర్ ను డకౌట్ చేశాడు. ఇదే ఊపులో రెండో ఓవర్ తొలి బంతికి ఫాఫ్ డుప్లెసిస్ (3)ను.. మూడో ఓవర్ తొలి బంతికి అభిషేక్ పోరెల్ (8)ను పెవిలియన్ కు పంపి ఢిల్లీని కష్టాల్లో పడేసాడు. ఆరో ఓవర్ లో హర్షల్ పటేల్ అక్షర్ పటేల్ వికెట్ తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే లో కేవలం 4 వికెట్ల నష్టానికి 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

►ALSO READ | IPL 2025: నెలకే నిషేధం ఎత్తివేత: ప్లే ఆఫ్స్‌కు ముందు గుజరాత్‌కు బంపర్ న్యూస్.. ఐపీఎల్‌కు వచ్చేస్తున్న రబడా

8 ఓవర్ తొలి బంతికి ఉనాద్కట్ కీలక బ్యాటర్ రాహుల్ (10) ను ఔట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ను స్టబ్స్, విప్రాజ్ నిగమ్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. 5 ఓవర్ల పాటు వికెట్ పడకుండా 32 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. 12 ఓవర్ తొలి బంతికి విప్రాజ్ నిగమ్ (18) రనౌట్ కావడంతో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఢిల్లీని స్టబ్స్, ఆశుతోష్ శర్మ భాగస్వామ్యంతో జట్టు స్కోర్ ను 130 పరుగులు దాటించాడు. ఏడో వికెట్ కు 68 పరుగులు జోడించి జట్టు పరువును కాపాడారు.