IPL 2025: నెలకే నిషేధం ఎత్తివేత: ప్లే ఆఫ్స్‌కు ముందు గుజరాత్‌కు బంపర్ న్యూస్.. ఐపీఎల్‌కు వచ్చేస్తున్న రబడా

IPL 2025: నెలకే నిషేధం ఎత్తివేత: ప్లే ఆఫ్స్‌కు ముందు గుజరాత్‌కు బంపర్ న్యూస్.. ఐపీఎల్‌కు వచ్చేస్తున్న రబడా

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు ముందు గుజరాత్ టైటాన్స్ కు అదిరిపోయే వార్త అందింది. సౌతాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా ఐపీఎల్ కోసం గుజరాత్ జట్టులో చేరనున్నారు. వాంఖడే వేదికగా మంగళవారం (మే 6) ముంబైతో జరగనున్న మ్యాచ్ లో అందుబాటులో ఉండనున్నాడు. వరుస విజయాలతో ఊపు మీదున్న గుజరాత్ కు ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్. రబడా రాకతో గిల్ సేన మరింత పటిష్టం కానుంది. ఐపీఎల్ లో తొలి రెండు మ్యాచ్ లాడిన రబడా వ్యక్తిగత కారణాలు చూపుతూ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. 

ALSO READ | IPL 2025: CSK జట్టులో మరో చిచ్చర పిడుగు: ఫాస్టెస్ట్ సెంచరీ హీరోని రూ.30 లక్షలకు పట్టేసిన చెన్నై

అంతలోనే షాక్ ఇస్తూ నిషేధిత రిక్రియేషనల్ డ్రగ్ వాడిన కారణంగా తాను  తాత్కాలిక సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాననే సంచలన విషయాన్ని బయట పెట్టాడు. దక్షిణాఫ్రికా ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్స్ (SAIDS) కగిసో రబాడ డ్రగ్స్ పదార్థాన్ని వాడినందుకు తన ఒక నెల నిషేధాన్ని పూర్తి చేశాడని.. అతను మ్యాచ్ లు ఆడేందుకు అర్హుడని సోమవారం (మే 5) ధృవీకరించింది. రూ. 10.75 కోట్లతో ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులోకి వచ్చిన రబాడ కేవలం రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు మాత్రమే ఆడి వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. 

నేను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చినట్టు చెప్పాను. కానీ, రిక్రియేషనల్ డ్రగ్ వాడినట్లు డోప్ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో తేలడమే అసలు కారణం. ప్రస్తుతం నేను తాత్కాలిక సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాను. అయితే నాకెంతో ఇష్టమైన ఆటలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్న రబాడ చేసిన తప్పుకు క్షమాపణ కోరాడు. జనవరి–-ఫిబ్రవరిలో ఎస్‌‌‌‌‌‌‌‌ఏ20 లీగ్‌‌‌‌‌‌‌‌లో ఆడుతున్నప్పుడు రబాడ నుంచి సేకరించిన శాంపిల్‌‌‌‌‌‌‌‌ డ్రగ్‌‌‌‌‌‌‌‌ టెస్టులో పాజిటివ్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్ వచ్చినట్టు సౌతాఫ్రికా క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రబాడ ఐదవ స్థానంలో ఉన్నాడు. మొత్తం 70 మ్యాచ్‌ల్లో 327 వికెట్లు పడగొట్టాడు.