న్యూఢిల్లీ: ఇండియా డేవిస్ కప్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ పదవీ కాలాన్ని.. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) పొడిగించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది. స్వదేశంలో నెదర్లాండ్స్‌తో క్వాలిఫయర్స్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఏఐటీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అశుతోష్ సింగ్ జట్టు కోచ్‌గా కొనసాగించారు.
డేవిస్ కప్‌లో ఇండియా ఫైనల్స్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో స్వదేశంలో జరిగే మ్యాచ్‌లు కీలకంగా మారడంతో రాజ్‌పాల్‌కు ఉన్న ఎక్స్‌పీరియెన్స్ దృష్ట్యా అతన్ని తిరిగి కొనసాగించాలని అందరూ భావించారు. వచ్చే ఏడాది డేవిస్ కప్‌లో ఆడే అన్ని మ్యాచ్‌లను రాజ్‌పాల్ పర్యవేక్షించనున్నాడు. ఇక ఫిబ్రవరిలో జరిగే క్వాలిఫయర్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ, కర్ణాటక ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేశాయి.
