Good Sleep: అస్సలు నిద్ర పట్టడం లేదా..! అయితే ఈ జూస్ తాగండి.. వెంటనే నిద్రలోకి జారుకుంటారు..

Good Sleep:  అస్సలు నిద్ర పట్టడం లేదా..! అయితే ఈ జూస్ తాగండి.. వెంటనే నిద్రలోకి జారుకుంటారు..

పనిభారం.. ఒత్తిళ్లజీవితం.. అనేక ఆలోచనలు ఇవన్నీ కలిసి మనిషికి నిద్రను దూరం చేస్తున్నాయి.  దీంతో వీటికి తోడు అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.  కాని నిద్రపడితే  రిలీఫ్​ కలిగి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి చాలా సమస్యలు తీరుతాయని నిపుణులు చెబుతున్నారు.  కాని ఎంత సేపటికి నిద్ర రాకపోతే చెర్రీస్​ పండ్ల జ్యూస్​ ను తాగండి.. ఇక వెంటనే నిద్రలోకి జారుకుంటారని నిపుణులు చెబుతున్నారు.  

చెర్రీస్​ పండ్లు చూడటానికి చాలా అందంగా  ఉంటాయి. తింటే పుల్లపుల్లగాభలే బాగుంటాయి.  ఈ పండ్లను సర్వరోగ నివారిణి అంటారని ఓ పరిశోధనలో రుజువైంది.  సరిగా నిద్రలేకపోతే   సర్వరోగాలు స్వాగతం పలుకుతాయి. ఈ సమస్యకు ఇంటిలోనే పాటించదగ్గ చక్కటి పరిష్కారం ఉంది పుల్లని చెర్రీ పండ్ల జ్యూస్ మెగ్నీషియం కాంబినేషన్. ఇది ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

 నిద్ర  సక్రమంగా ఉంటే  ప్రశాంతమైన  ఉండటమే కాదు.. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుగా ఉంటుంది.  నిద్రలేమి మాత్రం అందుకు భిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది. సరిగ్గా నిద్రపట్టకపోతే మానసిక ఆందోళనకు, గందరగోళానికి దారితీస్తుంది.దీంతో  ఏకాగ్రత, జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. అయితే  పుల్లని చెర్రీ పండ్ల జ్యూస్​ నిద్రలేమికి మంచి ఔషధమని పరిశోధకులు చెబుతున్నారు.

పుల్లని చెర్రీ పండ్ల జ్యూస్ మెగ్నీషియం కాంబినేషన్ గాఢమైన నిద్రను ప్రేరేపిస్తుంది.  50 సంవత్సరాలు దాటిన  ఇన్సామ్నియా బాధితులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.  ఆ నివేదిక ప్రకారం .. ఈ జ్యూస్లో మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉంటుంది. జ్యూస్ తాగిన తర్వాత అది శరీరానికి..  విశ్రాంతి అవసరమని..  నిద్రను ప్రేరేపిస్తుంది.ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ కూడా ఉంటుంది . ఇది శరీరంలో ప్రశాంతతకు కారణమయ్యే మెలటోనిన్, సెరటోనిన్ హర్మోను ఉత్పత్తి చేస్తుంది. 

చెర్రీస్​ పండ్లలో  మెగ్నీషియం ఉంటుంది.  ఇది  నరాలను ..  కండరాలను రిలాక్స్ చేసి, నిద్రను మెరుగు పరుస్తుంది. నిద్రలేమితో ఇబ్బంది పడేవారు నిద్రపోవడానికి గంట ముందు ఒక   కప్ ప్యూర్ టార్ట్ చెర్రీ జ్యూస్లో .. ఒక  టేబుల్ స్పూన్ మెగ్నీషియం పౌడర్ కలిపి తాగితే ప్రశాంతంగా ఎలాంటి ఆలోచలు రాకుండా నిద్రపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. .

 ముఖ్యమైన ప్రయోజనాలు

  • ప్రశాంతమైన  నిద్ర:  పుల్లని చెర్రీ పండ్లలో పాలిఫెనాల్స్, ఆంథోసైనిన్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి .  ఇవి మంచిగా ప్రశాంతంగా  నిద్ర పట్టేందుకు . సహజమైన మెలటోనిన్​అనే హార్మొన్​ ను ఉత్పత్తి చేస్తాయి. 
  • కండరాల పునరుద్ధరణ: టార్ట్ చెర్రీస్​ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ (వాపు నిరోధక) పదార్దం.. వ్యాయామం తర్వాత కండరాల నొప్పి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
  • వాపు, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు: పుల్లని చెర్రీస్​ లోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని, దీర్ఘకాలిక వాపును ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
  • కీళ్ల ఆరోగ్యం: ఇంకా ఇందులో ఉండే  యాంటీ ఇన్​ ఫ్లమేటరీ  పదార్దాలు  ఆర్థరైటిస్​  నొప్పిని తగ్గించడం.., కండరాల దృఢత్వాన్ని పెంచడం..  యూరిక్ యాసిడ్ స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి.