యాషెస్‌‌‌‌ రెండో టెస్ట్‌.. ఆస్ట్రేలియా X ఇంగ్లండ్‌‌.. కీలక మార్పులు చేసిన రెండు జట్లు

యాషెస్‌‌‌‌ రెండో టెస్ట్‌.. ఆస్ట్రేలియా X ఇంగ్లండ్‌‌.. కీలక మార్పులు చేసిన రెండు జట్లు

బ్రిస్బేన్‌‌‌: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్‌‌‌‌ రెండో టెస్ట్‌‌‌‌ (డేనైట్‌‌‌‌)కు రంగం సిద్ధమైంది. తొలి టెస్ట్‌‌‌‌లో గెలిచి జోరుమీదున్న కంగారూలు అదే ఫామ్‌‌‌‌ను కొనసాగించాలని భావిస్తుండగా, ఇంగ్లండ్‌‌‌‌ బజ్‌‌‌‌బాల్‌‌‌‌ స్ట్రాటజీతోనే ముందుకెళ్లాలని యోచిస్తోంది. ఇందు కోసం రెండు జట్లు ఫైనల్‌ ఎలెవన్‌లో కీలక మార్పులు చేశాయి. 

తొలి టెస్ట్‌‌‌‌ చాలా త్వరగా ముగిసిపోవడంతో ఇరుజట్లకు కావాల్సినంత విశ్రాంతి లభించింది. దాంతో ప్లేయర్లు కూడా చాలా ఉత్సాహంగా మ్యాచ్‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. తొలి టెస్ట్‌‌‌‌లో బ్యాటింగ్‌లో తడబడిన ఇంగ్లిష్‌‌‌‌ జట్టు ప్రధానంగా దానిపై దృష్టి పెట్టింది.

జాక్‌‌‌‌ క్రాలీ, బెన్‌‌‌‌ డకెట్‌, ఒలీ పోప్‌‌‌‌, జో రూట్‌తో పాటు హ్యారీ బ్రూక్‌‌‌‌, బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ భారీ ఇన్నింగ్స్‌‌‌‌పై దృష్టి సారించారు. అయితే మిడిలార్డర్‌‌‌‌లో అట్కిన్సన్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మోకాలి సమస్యలతో మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఇంగ్లండ్‌‌‌‌కు ఎదురుదెబ్బ. అతని ప్లేస్‌‌‌‌లో  స్పిన్నర్‌‌‌‌ విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ను తీసుకున్నారు. 

ఫ్రంట్‌‌‌‌ లైన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ షోయబ్‌‌‌‌ బషీర్‌‌‌‌ కాదని జాక్స్‌‌‌‌ను తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వెన్ను నొప్పి నుంచి కోలుకోలేకపోయిన ఉస్మాన్‌‌‌‌ ఖవాజా స్థానంలో ఆసీస్‌‌‌‌ జాక్‌‌‌‌ వెదరాల్డ్‌‌‌‌ను తీసుకుంది. ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌తో కలిసి అతను ఓపెనింగ్‌‌‌‌ చేయనున్నాడు. జోస్‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌ను మిడిలార్డర్‌‌‌‌లో ఆడించనున్నారు.