బంగారం ధరలు ఇవాళ (4, డిసెంబర్) గురువారం రోజున కాస్త తగ్గాయి. అయితే నిన్న, మొన్నటి వరకు పరుగులు పెట్టిన ధరలు ఇవాళ కొంత చల్లబడ్డాయి. అయితే ఇప్పటికి ఆల్ టైం హైలోనే బంగారం ధరలు ఉండటం గమనార్హం. ఇక పెళ్లిళ్ల సీజన్, పండగ సీజన్లో కస్టమర్లకు చుక్కలు చూపించిన ధరలు సామాన్యు కొనుగోలుదారులకు మాత్రం కొనగలమా అనే స్థాయికి చేరాయి. దింతో తులాలల్లో కొనే కస్టమర్లు గ్రాముల్లో కొనేందుకు మాత్రమే పరిమితం అయ్యారు.
బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి చాల అంశాలు తోడవుతాయి. ప్రపంచ రాజకీయ పరిస్థితులు సహా డాలరుతో రూపాయి విలువ కూడా బంగారం ధరల పై ప్రభావం చూపుతాయి. మరోవైపు ఈ ఏడాది మొత్తంగా చూస్తే బంగారం ధర భారీగా పెరిగింది. బంగారంతో పాటు వెండి కూడా కేజీ ధర లక్షకి చేరువలో ఉండగా, ప్రస్తుతం 2 లక్షలకి దగ్గరలో కొనసాగుతుంది.
బంగారం కొనేందుకు చూస్తున్న కస్టమర్లకి ప్రస్తుతం ఈ ఏడాది చివరిలో బంగారం ధరల్లో పెద్దగా మార్పు ఉండబోదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఈ స్థాయికి బంగారం, వెండి ధరలు చేరుకుంటాయో అని అంచనా వేస్తున్నారు. భారతీయ పెట్టుబడిదారులకు బంగారం ఒక దీర్ఘకాలిక ఆస్తిగా మిగిలిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఉన్న.. డిమాండ్ స్థిరంగా ఉంది.
ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల 1 గ్రాముకు రూ.22 తగ్గి రూ.13,036, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.20 తగ్గి రూ.11,950, 18 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.16 తగ్గి రూ.9,778 .
దింతో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.220 తగ్గి రూ.1,30,360, 22 క్యారెట్ల ధర రూ.200 పడిపోయి రూ.1,19,500, 18 క్యారెట్ల ధర రూ.160 దిగొచ్చి రూ.97,780.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,30,360, 22 క్యారెట్ల ధర రూ.1,19,500, 18 క్యారెట్ల ధర రూ.97,780.
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,30,360, 22 క్యారెట్ల ధర రూ.1,19,500, 18 క్యారెట్ల ధర రూ.97,780. ఇక ఈరోజు వెండి ధర 1 గ్రాముకు రూ.191, 1 కిలోకి రూ.1,91,000 వద్ద స్థిరంగా ఉంది.
