సినీ ప్రేక్షకుల్లో బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌పై అద్భుతమైన క్రేజ్ ఉంది. సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో బాలకృష్ణ ఫ్యాన్స్కు మంచి విందునిచ్చాడు బోయపాటి. ఇక ఇప్పుడు ‘అఖండ2’తో మరింత సాలిడ్ విందు ఇవ్వనున్నారు బోయపాటి. ఈ సందర్భంగా నట సింహం బాలకృష్ణ.. బాక్సాఫీస్ వేటకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం (డిసెంబర్ 5న) అఖండ 2తో ప్రపంచవ్యాప్తంగా బాలయ్య తన సింహ గర్జనను వినిపించనున్నారు.
అందుకు తగ్గట్టుగానే అఖండ 2.. అడ్వాన్స్ బుకింగ్స్లో దుమ్మురేపుతోంది. ఇప్పటికే, తెలంగాణ మినహా ఏపీ, నార్త్, ఓవర్సీస్ లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే, ఇలాంటి సమయంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. బాలయ్య పవర్.. నార్త్ బాక్సాఫీస్ పై జోరు చూపిస్తున్నట్లు బాలీవుడ్ నివేదికలు వెల్లడించాయి.
"అఖండ 2"కి పోటీగా వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ "ధురంధర్" సినిమాల బుకింగ్స్ విషయంలో హోరాహోరీ పోటీ నెలకొంది. నివేదికల ప్రకారం, అఖండ 2 బుకింగ్స్ నార్త్ లో దురంధర్ మూవీకి గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నాయి. ఇండియాలో " ధురంధర్ " 2D మరియు IMAX 2D హిందీ వెర్షన్లలో 58,801 టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ క్రమంలో.. దురంధర్ ప్రీ సేల్స్ ద్వారా ఇప్పటివరకు రూ.2.59 కోట్లు వసూలు చేసినట్లు టాక్.
అఖండ 2: తాండవం విషయానికి వస్తే.. ప్రీ సేల్స్ బుకింగ్స్లో చాలా మెరుగ్గా రాణిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అఖండ 2కి 57,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అయితే, ఈ మూవీ.. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ, ధురంధర్ కంటే కొంచెం తక్కువ బుకింగ్స్లో ఉండటం విశేషం. దీన్నీ బట్టి చూస్తుంటే.. అఖండ 2 ఎంత వేగంగా టికెట్లు బుకింగ్స్ అవుతుందనేది అర్థమైతుంది. అఖండ 2 ఇలానే కొనసాగితే, అలాగే ఇవాళ (డిసెంబర్ 4న) ఓవర్సీస్ ప్రీమియర్స్లో పాజిటివ్ టాక్ అందుకుంటే.. ధురంధర్ కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడవుతాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
అఖండ 2కి నార్త్ లో కలిసొచ్చిన అంశాలు: సనాతన కాన్సెప్ట్పై అఖండ 2 తెరకెక్కింది. కుంభమేళా, హిమాలయాలు వంటి డివోషనల్ ప్లేసెస్ లలో సినిమాను షూట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే ‘అఖండ2’ టీజర్, ట్రైలర్ విజువల్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. పిల్లలు, ప్రకృతి, ధర్మం జోలికెళ్తే దేవుడు మనిషిలో ఆవహించి శిక్షిస్తాడు అని చూపించారు. అధర్మం, అకృత్యాలు మితిమీరితే మనిషే ఆ దేవుడిని ఆవహించుకుని దుష్టశిక్షణ చేస్తాడనేది మేకర్స్ ప్రమోషన్స్లలో కూడా చెప్పుకొస్తున్నారు. సినిమాకు మౌత్ టాక్ బాగుంటే.. నార్త్ బాక్సాఫీస్ పై అఖండ 2 దండయాత్ర చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే.. పుష్ప 2 జెండా పాతేసింది. ఇక తరువాయి అఖండ 2!!!
