పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘ది రాజా సాబ్’ (The RajaSaab). సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇండియన్ సినీ ఆడియన్స్లో ఆసక్తితో పాటుగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు ముఖ్య కారణం.. ప్రభాస్ తన 24 ఏళ్ళ సినీ కెరీర్లో ఫస్ట్ టైం హార్రర్ థ్రిల్లర్ జానర్లో సినిమా చేస్తుండటం. అలాగే, మీడియం రేంజ్ హీరోల సినిమాలతో ఆకట్టుకునే మారుతి.. ఒక ఫ్యాన్ భాయ్గా ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా తీయడం. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్ విడుదల చేసి.. సినిమా ఎలాంటి థ్రిల్ ఇవ్వనుందో భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేశారు మారుతి. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగిస్తోంది.
లేటెస్ట్ విషయానికి వస్తే.. ‘ది రాజా సాబ్’ విడుదలకు ఇంకా నెలరోజుల టైం మాత్రమే ఉంది. ఈ సందర్భంగా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా రన్‌టైమ్‌పై ఆడియన్స్కు ఒక సాలిడ్ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. ‘ది రాజా సాబ్’ భారీ రన్‌టైమ్‌తో విడుదల కానుంది. అంటే ప్రభాస్ కెరియర్లోనే హయ్యెస్ట్ నిడివి ఉన్న సినిమాగా రాజాసాబ్ నిలవనుంది అన్నమాట.
అమెరికా టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం.. ‘ది రాజా సాబ్’ మూవీ రన్‌టైమ్ సుమారు 3 గంటలా 14 నిమిషాలుగా కనిపిస్తోంది. సో.. ఇది డార్లింగ్ ఫ్యాన్స్ కు పండుగనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. సాధారణంగా హార్రర్ థిల్లర్ సినిమాలంటే ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటిది.. ప్రభాస్ లాంటి స్స్టార్ హీరో సినిమా.. అందులోనూ హార్రర్ ఫిలిం.. ఇక చెప్పేదేం ముందు ఫ్యాన్స్ కి పండుగనే చెప్పాలి.
ప్రభాస్ గత సినిమాల నిడివి చూసుకుంటే.. బాహుబలి 1 నిడివి "2 గంటల 45 నిమిషాలు", బాహుబలి 2 నిడివి "2 గంటల 47 నిమిషాలు", సలార్ మాత్రం 2 గంటల 55 నిముషాలు ఉంది. ఇక రాజాసాబ్ రన్ టైం (గం.3:14 నిమిషాలు) అనే విషయంపై సెన్సార్ మరియు మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. సో.. అప్పటివరకు క్లారిటి విషయంలోకాస్తా సంయనం పాటించాలి సుమా!
ఇదిలా ఉంటే.. హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్కి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
