జీవన్‌‌రెడ్డి ఇంటి వద్ద ‘జన జీవనుడు’ పేరుతో ఫ్లెక్సీ..జగిత్యాలలో ఆసక్తికర చర్చ

జీవన్‌‌రెడ్డి ఇంటి వద్ద ‘జన జీవనుడు’ పేరుతో ఫ్లెక్సీ..జగిత్యాలలో ఆసక్తికర చర్చ
  • కాంగ్రెస్‌‌ నాయకుల ఫొటోలు లేకుండానే ఏర్పాటు
  • జగిత్యాలలో ఆసక్తికర చర్చ

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌‌రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీ మార్పు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు కాంగ్రెస్‌‌ పార్టీకి చెందిన నేతల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీని సోమవారం తొలగించారు. దాని స్థానంలో జీవన్‌‌ రెడ్డి ఫొటో తప్ప మరే నాయకుడి ఫొటో లేకుండా.. ‘జన జీవనుడు’ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జీవన్‌‌రెడ్డి కాంగ్రెస్‌‌కు రాజీనామా చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఫ్లెక్సీ మార్పు మరింత బలం చేకూర్చినట్లైంది. జీవన్‌‌రెడ్డి పార్టీ మారేందుకు ఈ నెల 25న ముహూర్తం ఫిక్స్‌‌ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.