మాఘ, పాల్గుణ మాసాల్లో వచ్చే శిశిర రుతువు ప్రకృతికి కొత్త అందాలను తీసుకొస్తుంది. ఓ వైపు చెట్ల ఆకులు రాలిపోతుంటే.. మరో వైపు కొత్త చిగురు పుట్టుకొస్తుంది. దూరం నుంచి ఏ చెట్టును చూసినా మోడు వారినట్లే కనిపిస్తున్నా.. దగ్గరకు వెళ్లి చూస్తేనే కొత్త చిగురు దర్శనమిస్తుంది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో పూర్తిగా ఆకులు రాలిపోయిన చెట్లు ఇలా ఆకట్టుకుంటున్నాయి - హైదరాబాద్, వెలుగు
