CBSE విద్యార్థుల కోసం కొన్ని కొత్త మార్పులు తీసుకురాబోతుంది. వీటిలో చాలా వరకు 2026 విద్యా సంవత్సరం నుండి అమలవుతాయి. అయితే ఈ మార్పులు సిలబస్, కొత్త సబ్జెక్టులు, పరీక్షా విధానం, మార్కులు ఇచ్చే విధానంలో ఉన్నాయి.
1. 10 & 12 తరగతుల సిలబస్‌లో మార్పులు: 10వ తరగతి విద్యార్థులు కోర్ సబ్జెక్టులతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి మూడు స్కిల్స్ సబ్జెక్టులలో (Skill-based Subjects) ఒకటి తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి. సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ వంటి సబ్జెక్టుల్లో ఎవరైనా ఫెయిల్ అయితే, ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టులో పాస్ అయిన స్కిల్ సబ్జెక్టు (Skill Subject) మార్కులు కలిపి ఫైనల్ రిజల్ట్‌లో పాస్ మార్కులు లెక్కిస్తారు. 12వ తరగతిలో ఎలక్ట్రానిక్స్ & హార్డ్‌వేర్, డిజైన్ థింకింగ్ వంటి నాలుగు కొత్త స్కిల్ సబ్జెక్టులు చేర్చారు.
2. బేసిక్ మాథ్స్ (Basic Math) తీసుకున్న విద్యార్థులు కూడా 11వ తరగతిలో బేసిక్ మాథ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదివరకు 10వ తరగతిలో బేసిక్ మ్యాథ్స్ తీసుకున్న వారు 11వ తరగతిలో 'స్టాండర్డ్ మ్యాథ్స్' తీసుకోలేకరు. ఇప్పుడు 2025-26 నుండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.
3. 2026 నుండి 10వ తరగతి బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు ఉంటాయి అంటే 2026 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మొదటి బోర్డు పరీక్ష ఫిబ్రవరిలో తప్పనిసరిగా రాయాలి. రెండో బోర్డు పరీక్ష మే నెలలో ఉంటుంది, ఇది అప్షనల్. మంచి మార్కుల(improvement) కోసం మళ్లీ రాయాలనుకుంటే రాయవచ్చు. పరీక్ష ఒత్తిడి తగ్గించడానికి ఇది చాల ఉపయోగపడుతుంది.
4. 11వ & 12వ తరగతి లీగల్ స్టడీస్ సిలబస్‌లో కొత్త అంశాలు చేర్చనున్నారు. ఇందుకు చట్టానికి సంబంధించిన సబ్జెక్టుల్లో (Legal Studies) కొన్ని మార్పులు చేశారు. అవి ట్రిపుల్ తలాక్ రద్దు, సెక్షన్ 377 రద్దు, దేశద్రోహం (Sedition) తొలగింపు, కొత్త ఇండియన్ పీనల్ కోడ్ (BNS) గురించి బోధించడం ఉన్నాయి.
5. క్వశ్చన్ పేపర్ ఫార్మాట్‌లో మార్పులు: క్వశ్చన్ పేపర్ లో ప్రశ్నలకు బదులు, కాంపిటెన్సీ (Competency-focused) ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ (Objective), వివరణ(Descriptive) ప్రశ్నలు కలిపి ఉంటాయి.
6. కాంపిటెన్సీ ఆధారంగా మార్కులు : మార్కులు ఇచ్చేటప్పుడు నిజ ప్రపంచంలో సమస్యలను పరిష్కరించడానికి, విషయాలను ఎలా ఉపయోగిస్తున్నారు అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి పేపర్‌లో 50 శాతం వరకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs), కేస్-బేస్డ్ (Case-based), సోర్స్-బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి.
7. రెండు-స్థాయిల మార్కుల విధానం: ఇప్పుడు మార్కులను రెండు భాగాలుగా విభజించారు. 60 శాతం బోర్డు పరీక్షల నుండి మిగిలిన 40 శాతం స్కూల్లో జరిగే ఇంటర్నల్ పరీక్షలు, ప్రాజెక్టు వర్క్స్ నుండి. ఈ విధానం 2026-27 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
8. 9-పాయింట్ల గ్రేడింగ్ స్కేల్: ఇప్పుడు మార్కులకు బదులు 9-పాయింట్ల గ్రేడింగ్ ఇస్తారు అంటే A1, A2, B1, B2 ఇలా... ఇది పాత 5-పాయింట్ల వ్యవస్థ కంటే వివరంగా ఉంటుంది. ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు A1 గ్రేడ్ ఇస్తారు.
9. కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)& డిజైన్ థింకింగ్ వంటి లేటెస్ట్ స్కిల్స్ సబ్జెక్టులను కొత్తగా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ALSO READ : మైక్రోసాఫ్ట్ లో టెక్నికల్ గ్లిచ్..
10. డిజిటల్ ఎవాల్యుయేషన్ & పరీక్ష భద్రత: పరీక్ష పేపర్లను ఆన్‌స్క్రీన్‌లో డిజిటల్‌గా దిద్దేందుకు CBSE ఏర్పాట్లు చేస్తోంది.పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ (finger print) కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
