దాదాపు 20 ఏండ్ల లాంగ్ గ్యాప్ తర్వాత "టైగర్ నాగేశ్వరరావు" చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది నటి రేణు దేశాయ్. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ తర్వాత రేణు డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకట్టారు. కానీ వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించింది. మళ్లీ దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న తర్వాత ఇప్పుడు నటిస్తోంది. లేటెస్ట్ గా ' పదహారు రోజుల పండుగ' చిత్రంలో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తికాగా త్వరలోనే.. షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది.
ఇదిలాఉండగా.. లేటెస్ట్ గా రేణు దేశాయ్ హైదరాబాద్ లో జరిగిన ఓ ప్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసి షాకిచ్చింది . దీనికి సంబంధించిన విషయాలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'దాదాపు 26 ఏండ్ల తర్వాత ర్యాంప్ నై నడిచేందుకు వేదికపైకి వెళ్లడానికి 10 నిమిషాల ముందు. నా పర్సనల్ మేకప్ మెన్ ఇసువ స్టాండ్ మీది నుంచి జాతిపడ్డాడు. బరువైన వస్తువు అతని తలను తాకింది. ఆ క్షణంలో నాకు చుక్కలు కనిపించాయి. అతని పరిస్థితి తలచుకుని నా కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పింది రేణు దేశాయ్..
అదే సమయంలో షో ప్రారంభం కావడంతో నేను ఏం చేయలేకపోయా... ఆ నొప్పిని, బాధను ధరిస్తూనే వాక్ చేయాల్సి వచ్చిందని రేణు పోస్ట్ చేసింది.. అప్పుడు నన్ను గమనించినట్లయితే నా కళ్లుగా ఎర్రగా నీటితో నిండిపోయాయి. నేను ప్రస్తుతం చాలా బాధలో ఉన్నాను.. షోలో గందరగోళం లేకుండా ఉండటానికి నా వంతు ప్రయత్నం చేశాను అని చెప్పింది. దీనిని వ్యక్తిగత కారణాల వల్ల పంచుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలాంటి బాధను అనుభవిస్తున్నాడో, తన పరిస్థితిని కొనసాగించడానికి ఎంత కష్టపడుతున్నాడో. మనకు తెలియదు. అందుకే తోటివారి పట్ల మరింత దయతో ఉండాలి అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చింది..
