హైదరాబాద్: టీజీ ఎప్ సెట్-2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ శుక్రవారం (జనవరి 30) షెడ్యూల్ రిలీజ్ చేసింది. షెడ్యూల్ ప్రకారం.. 2026, ఫిబ్రవరి 14న ఎప్ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9 నుంచి జూన్ 14 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ ఎప్ సెట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఎప్ సెట్ ర్యాంకుల ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
