Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 13వ వారం ఓటింగ్ వార్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. టాప్ ప్లేస్‌లో ఊహించని ట్విస్ట్!

 Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 13వ వారం ఓటింగ్ వార్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. టాప్ ప్లేస్‌లో ఊహించని ట్విస్ట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. రోజులు దగ్గరపడుతున్న కొద్ది హౌస్ లో గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. 13వ వారం నామినేషన్ల ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య స్నేహాలు తెగిపోయి.. వాదనలు పతాక స్థాయికి చేరుకున్నారు. చివరి టాప్ 5 ఫైనలిస్ట్ లలో చోటు కోసం ఇంటి సభ్యలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ వారం నామినేషన్లలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారిలో తనూజ, భరణి, డెమాన్ పవన్, రీతూచౌదరి, సుమన్ శెట్టి, సంజనా. ఇక కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ ఈ వారం సేఫ్ గా ఉన్నారు.

హౌస్‌లో అగ్గి రాజేసిన వాదనలు

నామినేషన్స్, టాస్క్ లు సందర్భంగా జరిగిన గొడవలు, వ్యక్తిగత విమర్శలు ఈ వారం ఓటింగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం మెండుగా ఉంది. కెప్టెన్సీ టాస్క్‌తో పాటు, నామినేషన్ల సమయంలోనూ తనూజ, ఇమ్మాన్యుయేల్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇమ్మాన్యుయేల్ భావోద్వేగాలను ప్రశ్నించే క్రమంలో ఇద్దరూ ఎమోషనల్‌గా స్పందించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.  మరొవైపు డెమోన్ పవన్ ఇకపై తనదైన గేమ్ ఆడతాను అని శపథం చేయడం, అలాగే నామినేషన్స్‌లో సంజన, తనూజాలను టార్గెట్ చేయడం హౌస్‌లో మరింత హీట్ ను పెంచి అంచనాలను మార్చేసింది. .

ఓటింగ్ ట్రెండ్స్ లో ఆధిపత్యం..

13వ వారం ఇప్పటివరకు  నమోదైన ఓటింగ్ సరళిలో కొన్ని ఊహించని ఫలితాలు కనిపిస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం తనూజ ఎప్పటిలాగే తన టీవీ సెలబ్రిటీ హోదా, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఆమె దాదాపు 30 శాతానికి పైగా ఓట్లతో పటిష్టమైన లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా ఆమె టాప్ ఓటింగ్‌లోనే ఉంది. ఇక తనూజ తర్వాత స్థానంలో రీతూ చౌదరి దాదాపు 19 శాతం ఓట్లతో నిలిచిందని సమాచారం.. ఇటీవల సంజనతో జరిగిన గొడవలు, ఆమె స్టాండ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది . దీంతో ఆమె కాస్త మెరుగ్గా ఉంది.

 డేంజర్ జోన్‌లో ముగ్గురు కంటెస్టెంట్లు.. 

ఇప్పటి వరకు ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. అత్యల్ప ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు సంజన. గత వారం హోస్ట్ నాగార్జున ముందు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు పోరాడిన సంజనకు మొదట్లో కాస్త ఓటింగ్ పెరిగినప్పటికీ, మళ్లీ వెనుకబడింది. లేటెస్ట్ రిపోర్టుల ప్రకారం.. ఆమె ఓటింగ్ శాతం మధ్యస్థంగా ఉందని సమాచారం. అయితే ఆమె స్థానం ఎప్పుడు మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు నెటిజన్లు.. ఇక 'కార్తీకదీపం' ఫేమ్ భరణి ఈ వారం డేంజర్ జోన్‌లో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ఓటింగ్ రేసులో కొద్దిగా వెనుకబడ్డారని తెలుస్తోంది..

 ఈ సారి డెమోన్ పవన్ కు బాగానే ఓటింగ్ శాతం తగ్గిందని సమాచారం.  ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం డెమోన్ పవన్, హాస్యనటుడు సుమన్ శెట్టి  ఓటింగ్ శాతంలో అట్టడుగున ఉన్నారు. సుమన్ శెట్టికి అత్యల్ప ఓట్లు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇతను డేంజర్ జోన్‌లోకి వచ్చి సేఫ్ అయ్యారు. ఈ వారం బలమైన కంటెస్టెంట్లతో పోటీ ఉండడం సుమన్‌కు కష్టంగా మారింది. ఈ వారం నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో, సుమన్ శెట్టి ,  భరణిలు తీవ్రమైన ఎలిమినేషన్ గండంలో ఉన్నారని స్పష్టమవుతోంది. వారంతంలో ఈ ఓటింగ్ సరళి ఎలా మారుతుందో, ఎవరు హౌస్ నుంచి ఎలిమినేషన్ అవుతారో చూడాలి.