Chiranjeevi: చిరంజీవి భావోద్వేగం.. మెగా వారసుడి రాకపై చిరు ఏమన్నారంటే?

Chiranjeevi: చిరంజీవి భావోద్వేగం.. మెగా వారసుడి రాకపై చిరు ఏమన్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ మెగా దంపతులకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించడంతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మెగా వారసుల రాకపై మొదటిసారి స్పందించిన ఆయన, తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులకు తెలియజేశారు.

ఉపాసనకు విజయవంతంగా ప్రసవం నిర్వహించిన వైద్య బృందానికి చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆదరిస్తూ, అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ శుభవార్తతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మా ఇంట ఈ శుభం జరగాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. “థ్యాంక్యూ సో మచ్.. మా ఆనందానికి అవధులు లేవు” అంటూ చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు.

అంతకు ముంది చిరంజీవి సోషల్ మీడియా (X) వేదికగా స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. “అపారమైన ఆనందంతో, కృతజ్ఞతాభావంతో ఈ శుభవార్తను పంచుకుంటున్నాం. రామ్ చరణ్ మరియు ఉపాసనకు కవల పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ చిన్నారులు మా కుటుంబంలోకి రావడం తాతముత్తాతలుగా మాకు అపారమైన ఆనందాన్ని, దైవానుగ్రహాన్ని అందించింది. మా కుటుంబానికి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు: చిరంజీవి & సురేఖ” అని వెల్లడించారు