రాయ్‌పూర్: సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇండియా జట్టును ప్రకటించారు. బుధవారం సమావేశమైన సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. మెడ గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు కల్పించారు. అయితే తన ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) క్లియరెన్స్ ఇస్తేనే గిల్ మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. ఎడమ తొడ గాయంతో రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా మంగళవారం బరోడా తరఫున బరిలోకి దిగిన పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు. రింకూ సింగ్, నితీశ్ రెడ్డిపై వేటు పడింది. జితేష్ శర్మను సెకండ్ వికెట్ కీపర్‌గా తీసుకున్నారు.
స్టార్ పేసర్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్, హర్షిత్ రాణాను ఎంపిక చేశారు. స్పిన్ ఆల్‌రౌండర్లకూ చాన్స్ ఇచ్చారు. ఈ నెల 9, 11, 14, 17, 19న వరుసగా కటక్, ముల్లన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన టీమిండియా జెర్సీని ఆవిష్కరించారు.
జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
