కూకట్ పల్లిలో పెండ్లికి వెళ్లి, భార్యాభర్తలు మిస్సింగ్

కూకట్ పల్లిలో పెండ్లికి వెళ్లి, భార్యాభర్తలు మిస్సింగ్

కూకట్ పల్లి, వెలుగు: పెండ్లికి వెళ్లి, భార్యాభర్తలు మిస్సయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్​బీ కాలనీ రెండో రోడ్డు ఈడబ్ల్యూఎస్ 336లోని సెకండ్​ఫ్లోర్​లో సిద్ధాబత్తుల శ్రీనివాస్–శోభ దంపతులు నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం10 గంటలకు బంధువుల పెండ్లికి వెళ్లారు. 

తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. మధ్యాహ్నం సమయంలో శ్రీనివాస్​తమ్ముడు, సోదరి ఫోన్​చేస్తే ఇద్దరి ఫోన్లు స్విచ్​ఆఫ్​వచ్చాయి. దీంతో వారు ఎక్కడికి వెళ్లారన్నది తెలియడం లేదు. మిస్సింగ్​కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.