ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించింది. కరీంనగర్లో స్వల్ప భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఆకాశంలో ఉరుములు అనుకొని జనం లైట్ తీసుకున్నారు. కానీ.. భూమి స్వల్పంగా కంపించిందని కొంతసేపటికి తెలిసొచ్చింది. ఆ తర్వాత ఒకరితో ఒకరు ఫోన్ చేసుకుని భూకంపం వచ్చిందంటూ తమ అనుభవాలను స్థానికులు షేర్ చేసుకున్నారు. 

జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా భూమి ఒక్కసారిగా కంపించింది. 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. భూమి కుదుపులకు లోనయినట్లు అనిపించడంతో భయంతో ప్రజలు ఒక్కసారిగా ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాల పట్టణంతో పాటు కోడిమ్యాల, మాల్యాల, రాయికల్, పరిసర గ్రామాల్లో భూమి కంపించింది.

2024 డిసెంబర్ నెలలో కూడా తెలంగాణలో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్​స్కేల్పై 5.3 తీవ్రతతో డిసెంబర్ 4న ఉదయం 7:27 గంటలకు భూమి కంపించింది. భూకంప కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉండగా, దాని చుట్టూ దాదాపు 225 కిలోమీటర్ల దూరం వరకు 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. మైనింగ్​ బెల్ట్, గోదావరి బెల్ట్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ భూకంపం ధాటికి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పలు చోట్ల గోడలు కూలిపోయాయి. ఇండ్లలోని సామగ్రి చిందరవందరగా పడిపోయింది. 

మేడారం కేంద్రంగా గతేడాది డిసెంబర్ లో ఏర్పడిన భూకంప ప్రభావంతో తెలంగాణ సహా ఏపీ‌‌, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గోదావరి బెల్ట్ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. 

భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండగా.. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హనుమకొండ, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని పలు ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. ఏపీలోని విజయవాడ, గుంటూరు, మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాతో పాటు గోదావరి బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనూ చాలా చోట్ల డిసెంబర్ 2024లో భూమి కంపించింది.