
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత్ ఎర్త్ మూవర్స్
(బీఈఎంఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: 06( ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్)
ఎలిజిబిలిటీ: గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ(హెచ్ఆర్/ ఐఆర్) ఎంఎస్‌డబ్ల్యూ లేదా ఎంఏ (సోషల్ వర్క్‌తోపాటు హెచ్ఆర్/ ఐఆర్) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో రెండేండ్ల డిప్లొమా. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేబర్ లెజస్లేషన్తోపాటు హెచ్ఆర్/ ఐఆర్‌లో ఫుల్‌టైమ్ స్పెషలైజేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 14.
పూర్తి వివరాలకు t www.bemlindia.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.