ఆదిపురుష్ సినిమాలో నటించినందుకు.. నా కొడుక్కి సారి చెప్పా: సైఫ్ అలీఖాన్

ఆదిపురుష్ సినిమాలో నటించినందుకు.. నా కొడుక్కి సారి చెప్పా: సైఫ్ అలీఖాన్

ఆదిపురుష్... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణ పవిత్రతకు భంగం కలిగించేలా సినిమా చేశారంటూ హిందూ సంఘాలు సినిమా యూనిట్ పై మండిపడ్డాయి అప్పట్లో. ఈ సినిమాలో రావణుడి పాత్రలో విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో నటించినందుకు నా కొడుక్కి సారీ చెప్పానంటూ సైఫ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇంతకీ.. సైఫ్ తన కొడుక్కి ఎందుకు సారీ చెప్పాడంటే.. తాను విలన్ గా నటించిన ఆదిపురుష్ సినిమా తన కొడుక్కి చుపించానని.. అప్పుడు తన కుమారుడు తైమూర్‌ ఈసారి ఇలాంటి సినిమాలో చేస్తే.. హీరోగా నటించమని అడిగాడని అన్నారు. విలన్ గా నటించినందుకు సారీ చెప్పానని అన్నారు సైఫ్ అలీఖాన్. 

Also Read : శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్

తాను నటించిన అన్ని సినిమాల్లాగే ఆదిపురుష్ సినిమాను కూడా గౌరవిస్తానని.. తనకు సినిమా పట్ల గౌరవం ఎప్పటికీ ఒకేలా ఉంటుందని అన్నారు సైఫ్. తాను భిన్నమైన పాత్రల్లో నటిస్తుంటానని... తన సినిమాలు చూసినప్పుడు నువ్వు హీరోనా విలనా అని తన కుమారుడు అడుగుతూ ఉంటారని చెప్పుకొచ్చారు సైఫ్.