
మే నెలలో ఎండలు దంచికొడుతున్నాయి.సూర్యుడు భగభగలతో హడలెత్తిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే ఎండలు తీవ్రమవుతున్నాయి.వడగాల్పులు వీస్తున్నాయి. ఎండలో తిరిగితే చెమట ద్వారా నీరు ,లవణాలు బయటకు పోవడం వల్ల డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో చల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. ఎండాకాలంలో కొబ్బరి బోండాలు, చెరుకు రసం ఉత్తమమైన పానీయాలు. అయితే ఈ రెండు ఎలాంటి ప్రయోజనాలనుకలిగిస్తాయి.. వీటిలో ఏది బెటర్ వంటి విషయాలను తెలుసుకుందాం.
వేసవిలో ప్రజల మొదటి ఎంపిక చెరుకు రసం, కొబ్బరి నీరు. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
చెరుకు రసం.. ప్రయోజనాలు..
చెరుకు రసం పూర్తిగా నాచురల్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చెరుకు రసం తాగడం వల్ల శరీరం నుంచి హానికరమైన విషాన్ని బయటికి పంపిస్తుంది. కాలేయం ఆరోగ్యం ఉండేందుకు సాయపడుతుంది. వేసవిలో చెరకు రసం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తాగటం వదల్ల హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇందులో మూలకాలు చర్మాన్ని, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి.
కొబ్బరి నీళ్లు ప్రయోజనాలు..
వేసవిలో కొబ్బరి నీళ్లు ఎంతో ఆరోగ్యం. కొబ్బరి నీళ్ల వల్ల శరీరంలో హైడ్రేషన్ లోపంఉండదు. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.ఆమ్లతను తగ్గిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే బరువును నియంత్రించవచ్చు. బీపీ కంట్రోల్ అవుతుంది.
ఈ రెండింటిలో ఏదీ మంచిది..
వేసవిలో ఈ రెండింటికీ దేనికదే ప్రత్యేక ప్రయోజనాలందిస్తుంది. తక్షణ శక్తి కావాలనుకుంటే చెరుకు రసం తాగవచ్చు. త్వరగా శరీరాన్ని హైడ్రేట్ చేయాలనుకుంటే కొబ్బరి నీళ్లు తాగవచ్చు.డయాబెటిస్ ఉన్న వారు కొబ్బరి నీళ్లు తీసుకుంటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి అవసరాలకనుగుణంగా కొబ్బరి నీళ్లు, చెరకు రసం తాగవచ్చు.