బడులకు నిప్పు… సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా

బడులకు నిప్పు… సీబీఎస్ఈ ఎగ్జామ్స్ వాయిదా

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని స్కూళ్లపైనా ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. స్కూల్స్‌‌లోని పుస్తకాలు, బోర్డులు, డెస్కులకు నిప్పుపెట్టారు. అరుణ్‌‌ మోడ్రన్‌‌ సీనియర్‌‌‌‌ సెకండరీ స్కూల్‌‌కు నిప్పుపెట్టడంతో రికార్డులు, పుస్తకాలు కాలిపోయాయని, 70 లక్షల మేరకు నష్టం కలిగిందని స్కూల్‌‌ ప్రిన్సిపల్‌‌ జ్యోతి రాణి చెప్పారు. ఆ టైంలో స్టూడెంట్స్‌‌ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. 30 సంవత్సరాలకు చెందిన రికార్డులు కూడా తగలబడిపోయాయన్నారు. ఆందోళనకారులు స్కూల్స్‌‌పై దాడి చేయడం కరెక్ట్‌‌ కాదని తల్లిదండ్రులు సీరియస్‌‌ అయ్యారు. శివ్‌ విహార్‌‌‌‌లోని రాజధాని పబ్లిక్‌‌ స్కూల్‌‌లో కిండర్‌‌‌‌గార్డెన్‌‌ పిల్లల బ్యాగులు, క్రేయాన్స్‌‌, రిపబ్లిక్‌‌ డే సందర్భంగా తయారు చేసిన కొన్ని మోడల్స్‌‌ తగలబడిపోయాయని స్కూల్ మేనేజ్‌మెంట్ చెప్పింది. డీపీఆర్‌‌‌‌ స్కూల్‌‌ గేట్‌‌ కూడా పూర్తిగా ధ్వంసం అయింది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారిని నెట్టేసి లోపలికి చొరబడి నిప్పుపెట్టారని స్కూల్ టీచర్లు చెప్పారు.

ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 28, 29 తేదీల్లో జరగాల్సిన టెన్త్​, ప్లస్ టూ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్ఈ గురువారం ప్రకటించింది. ఢిల్లీ సర్కార్ రిక్వెస్ట్​తో పాటు స్టూడెంట్స్, స్టాఫ్ , పేరెంట్స్‌కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్ఈ సెక్రటరీ అనురాగ్ త్రిపాఠి చెప్పారు.

For More News..

యూత్‌కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’

వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టికెట్స్